భారతదేశం, మార్చి 23 -- TG DEECET 2025 : తెలంగాణలో రెండేళ్ల డీఈడీ కోర్సులో ప్రవేశానికి డీఈఈసెట్ నోటిఫికేషన్ విడుదలైంది. డీఈఈసెట్ కు రేపటి నుంచి (మార్చి 24వ) తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ మేరకు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. మే 15వ తేదీ వరకు ఇంటర్ పాసైన విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు. మే 25న ఆన్ లైన్ విధానంలో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.

అయితే ఈ ఏడాది చాలా ముందుగా మార్చి 22న నోటిఫికేషన్ విడుదల చేశారు. గత ఏడాది జూన్‌లో నోటిఫికేషన్‌ జారీ అయిన విషయం తెలిసిందే. గతేడాదితో పోలిస్తే దాదాపు రెండున్నర నెలల ముందుగానే నోటిఫికేషన్ వచ్చింది. దీంతో సకాలంలో కౌన్సెలింగ్‌ పూర్తై త్వరగా డీఈడీ తరగతులు ప్రారంభమవుతాయని అభ్యర్థులు భావిస్తున్నారు. గత కొన్నేళ్లుగా నవంబరు, డిసెంబరులో తరగతులు ప్రారంభం అవుతున్నాయి.

తెలంగాణల...