భారతదేశం, ఫిబ్రవరి 10 -- ప్రతి ఒక్కరికీ స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ సులువుగా అందుబాటులో ఉండటంతో.. సైబర్ నేరగాళ్లకు మోసాలు చేయడానికి అవకాశాలు పెరిగాయి. చాలా మందికి సైబర్ నేరాల గురించి సరైన అవగాహన లేకపోవడం వల్ల సులభంగా మోసపోతున్నారు. వ్యక్తిగత సమాచారం, ఓటీపీలు, పిన్‌లను ఇతరులతో పంచుకోవడం వల్ల నేరాలకు గురవుతున్నారు. సులభంగా డబ్బు సంపాదించాలనే అత్యాశతో మోసగాళ్ల వలలో చిక్కుకుంటున్నారు.

సైబర్ నేరాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలి. పాఠశాలలు, కళాశాలల్లో సైబర్ భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. వ్యక్తిగత సమాచారం, ఓటీపీలు, పిన్‌లను ఎవరితోనూ పంచుకోకూడదు. అనుమానాస్పద లింక్‌లు, మెసేజ్‌లను తెరవకూడదు. వాటి గురించి పోలీసులకు లేదా సైబర్ క్రైమ్ సెల్‌కు తెలియజేయాలి. కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లలో యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్ ఉపయోగించాలి. సైబర్ నేరానికి గురై...