భారతదేశం, అక్టోబర్ 29 -- రాష్ట్రంలో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే సీపీగెట్ - 2025 కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే 2 విడతలు పూర్తి కాగా. తాజాగా ఫైనల్ ఫేజ్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 1 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

ఆన్ లైన్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ కూడా ఇవాళ్టి నుంచి ప్రారంభమవుతుంది. నవంబర్ 1లోపు ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. అర్హులైన వివరాలను నవంబర్ 2వ తేదీన ప్రకటిస్తారు. నవంబర్ 2వ తేదీ నుంచి నవంబర్ 4వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లను ఎంచుకోవచ్చు. నవంబర్ 5వ తేదీన వెబ్ ఆప్షన్లను ఎడిట్ చేసుకోవాలి.

నవంబర్ 9వ తేదీన అభ్యర్థులకు సీట్లను కేటాయిస్తారు. ర్యాంకుల ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుంది. ఈ ఫైనల్ ఫేజ్ కింద సీట్లు పొందే విద్యార్థులు.. నవంబర్ 11వ తేదీలోపు కాలేజీల్లో రిపోర్టింగ్ చేస...