తెలంగాణ,హైదరాబాద్, ఏప్రిల్ 3 -- తెలంగాణలోని జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇందుకోసం ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించారు. ఇప్పటికే ఆ గడువు కూడా పూర్తయింది. అయితే ఈ ఉద్యోగాలకు సంబంధించి హైకోర్టు నుంచి మరో కీలక ప్రకటన జారీ అయింది.ఏప్రిల్ 15వ తేదీ నుంచి రాత పరీక్షలతో పాటు స్కిల్స్ టెస్ట్ ఉంటాయని వెల్లడించింది.

ఈ పరీక్షలను షిప్టులవారీగా నిర్వహిస్తారు. షిప్ట్ 1, 2, 3లుగా ఉంటాయి. ఇక ఏప్రిల్ 8వ తేదీ నుంచి హాల్ టికెట్లు అందుబాటులోకి వస్తాయి. https://tshc.gov.in/ వెబ్ సైట్ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ నోటిఫికేషన్ ద్వారా పలు జిల్లాల్లోని 1,673 ఉద్యోగాలను భర్తీ చేస్తారు. ఇందులో 1,277 నాన్-టెక్నికల్ పోస్టులు, 184 టెక్నికల్ పోస్టులు, జ్యుడీషియల్ మినిస్టీరియల్, సబార్డినేట్ సర్వీస్‌లోని 212 పోస్టులు ఉన్నాయి. వీటిల...