భారతదేశం, ఫిబ్రవరి 2 -- మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారారు. ముఖ్యంగా ఆయన ఇంటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అనిరుధ్ రెడ్డి బెడ్ రూంలో వెండి మంచం, వెండి కుర్చీలు, అన్ని వెండి వస్తువులే ఉన్నాయి. దీంతో అనిరుధ్ రెడ్డి ఇల్లు రాజభవనంలా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి విలాసవంతమైన ఇల్లు.. తెలంగాణ ప్రజలనే.. కాదు దేశ ప్రజల దృష్టిని ఆకర్షించింది. వెండి ఫర్నిచర్‌తో అలంకరించిన బెడ్ రూం, మంచాలు, బెడ్ సైడ్ టేబుల్స్ నుండి డ్రెస్సింగ్ టేబుల్స్, కాఫీ టేబుల్స్ వరకు వెండితో తయారు చేయించారు. ఓ యూట్యూబ్ ఛానల్ ఇటీవల అనిరుధ్ రెడ్డి ఇంటి హోమ్ టూర్ వీడియోను షేర్ చేసింది.

ఈ వీడియోలో అనిరుధ్ రెడ్డి.. తన గదిని ప్రత్యేకంగా ఉంచుకోవడానికి వెండి...