భారతదేశం, ఫిబ్రవరి 3 -- కుల గణనపై కాంగ్రెస్ ప్రభుత్వం కాకి లెక్కలు చెప్పిందని.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ విమర్శించారు. ఏ లెక్కన చూసినా.. తెలంగాణలో 50 నుంచి 52 శాతం బీసీలు ఉన్నట్లు తెలుస్తోందని.. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 46.2శాతం ఉన్నట్లు తేల్చిందని వ్యాఖ్యానించారు. ఇది కరెక్టే అని రేవంత్ రెడ్డి గుండె మీద చేసుకుని చెప్పాలని డిమాండ్ చేశారు.

'జనాభా లెక్కలపై అనుమానం ఉంది. మీరు చేసిన లెక్కలు కరెక్టే అయితే.. సర్వేలో నేను ఇచ్చిన వివరాలు, నా పేరు, ఆధార్ కార్డు నంబర్ కొడితే రావాలి. మూడు కోట్ల 50 లక్షల మంది సర్వే రిపోర్ట్‌లు వెబ్ సైట్‌లో అందుబాటులో ఉంచాలి. ఇది చిన్న విషయం కాదు. ప్రభుత్వం ఆగమాగం చేస్తుంది. మంత్రివర్గ సమావేశం, ఆ వెంటనే అసెంబ్లీ సమావేశం, దాంట్లో లఘు చర్చనట. బీసీ జనాభా అంటే చిన్న చూపా' అని కవిత ప్రశ్నించారు.

'మీ లెక్కల ప్రకారమే 46.2 శాతం బ...