భారతదేశం, ఫిబ్రవరి 22 -- ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో కులగణన నిర్వహించామని.. బలహీన వర్గాలకు కులగణన నివేదికే బైబిల్, భగవద్గీత, ఖురాన్.. అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కులగణన ఎక్స్‌రే లాంటిదని రాహుల్ గాంధీ ఆనాడే చెప్పారని గుర్తు చేశారు. అన్ని రంగాల్లో బీసీలకు సామాజిక న్యాయం జరగాలంటే.. కులగణన చేయాల్సిందేనని రాహుల్ గాంధీ స్పష్టం చేశారని రేవంత్ వివరించారు. తెలంగాణలో అధికారంలోకి రాగానే కులగణన చేసి తీరుతామని రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో మాట ఇచ్చారని.. గాంధీ కుటుంబం మాట ఇస్తే తప్పదని రేవంత్ వ్యాఖ్యానించారు.

'మన నాయకుడు ఇచ్చిన మాటను తూచా తప్పకుండా అమలు చేస్తున్నాం. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇలాంటి సాహసం చేయలేదు. కానీ తెలంగాణలో రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం అందరి భాగస్వామ్యంతో కులగణన నిర్వహించాం. సమగ్ర కుటుంబ సర్వే తప్పుల తడకగా ఉ...