భారతదేశం, ఫిబ్రవరి 3 -- ప్రధాన రాజకీయ పార్టీల పెద్దలు కుల గణన సర్వేలో వివరాలు ఇవ్వలేదని.. మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. కల్వకుంట్ల ఫ్యామిలీలో కవిత తప్ప.. ఎవరూ వివరాలు ఇవ్వలేదని చెప్పారు. సర్వే కోసం వెళ్లిన వాళ్లపైకి కుక్కలని వదిలిన వారూ ఉన్నారని ఆరోపించారు. సహాయ నిరాకరణ లాగా.. కొందరు కావాలని వివరాలు ఇవ్వలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

'కుల గణనపై అన్ని రాజకీయ పార్టీలు తమ స్టాండ్ ఏంటో తెలియచేయాలి. బలహీన వర్గాల కోసం అసెంబ్లీలో అన్ని పార్టీలు తమ వాదన వినిపించాలి. కులగణన ఒక ఉద్యమం లాగా చేశాం. రాష్ట్రంలో ఎవరు ఎంత అనే లెక్క తేలింది. క్యాబినెట్ సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటాం. కుల గణన చేస్తామని మాట ఇచ్చాం. చేసి చూపించాం' అని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.

'కుల గణన అడ్డుకుంటే ఊరుకునేది లేదు. కుల...