భారతదేశం, ఫిబ్రవరి 16 -- ఎన్నికలు అయిపోయాయి. ఏడాదికి పైగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన నడుస్తోంది. సంవత్సరం గడిచాక.. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కులాల ప్రస్తావన చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అసలు ప్రధాని మోదీ బీసీ కులానికి చెందిన వ్యక్తి కాదని వ్యాఖ్యానించారు. ఈ కామెంట్స్‌పై బీజేపీ భగ్గుమంది.

ఇటీవల తెలంగాణలో కులగణన జరిగింది. ఈ నివేదికను సీఎం రేవంత్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అప్పటినుంచి ప్రభుత్వంపై విమర్శలు పెరిగాయి. ప్రభుత్వానివి కాకి లెక్కలని బీఆర్ఎస్ విమర్శించింది. కానీ బీజేపీ మాత్రం కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. ముస్లింలను బీసీల్లో ఎలా కలుపుతారని కేంద్రమంత్రి బండి సంజయ్ లాంటివారు ప్రశ్నించారు. దీనికి తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల కారణంగా.. బ...