తెలంగాణ,హైదరాబాద్, ఫిబ్రవరి 12 -- తెలంగాణలో కులగణనపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. బుధవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన. పలు కారణాల రీత్యా కులగణన సర్వేలో పాల్గొనని వారి కోసం మరో అవకాశం కల్పిస్తున్నట్టు ప్రకటించారు. ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు సర్వే సిబ్బందికి వివరాలు అందజేయాలని డిప్యూటీ సీఎం భట్టి సూచించారు.

3.1 శాతం మంది సర్వేలో పాల్గొనలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. సర్వేలో పాల్గొనని వాళ్ల కోసమే మళ్లీ రీసర్వే చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఈ సర్వేలో పాల్గొని. వివరాలను నమోదు చేసుకోవాలని కోరారు.

కొందరు ఉద్దేశపూర్వకంగా వివరాలు చెప్పలేదని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. కేసీఆర్‌, కేటీఆర్‌ లాంటి వాళ్లు ఉద్దేశపూర్వకంగా సర్వేకు సహకరించలేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన సర...