భారతదేశం, ఫిబ్రవరి 15 -- TG Caste Census : కులగణన సర్వేలో పాల్గొనని వారికి రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఈ నెల 16 నుంచి 28వ తేదీ వరకు గతంలో కులగణన సర్వేలో పాల్గొనని వారి వివరాలు నమోదు చేయనున్నారు. కులగణన వివరాల నమోదు చేసుకునేందుకు టోల్‌ఫ్రీ నంబర్‌ 040-211 11111ను ఏర్పాటు చేసింది. టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేస్తే ఎన్యుమరేటర్లు... ఫోన్ చేసిన వారి ఇంటికి వెళ్లి వివరాలు నమోదు చేయనున్నారు. ఎంపీడీవో కార్యాలయం, వార్డు ఆఫీసులకు వెళ్లి కూడా తమ వివరాలు నమోదు చేసుకునేందుకు అధికారులు అవకాశం కల్పించారు.

కులగణన సర్వేలో రాష్ట్రవ్యాప్తంగా 3,56,323 కుటుంబాలు పాల్గొనలేదని అధికారులు గుర్తించారు. అలాగే https://seeepcsurvey.cgg.gov.in లో సర్వే ఫారం డౌన్‌లోడ్ చేసుకుని ప్రజాపాలన సేవా కేంద్రంలో అందించవచ్చు.

Published by HT Digital Content Services w...