భారతదేశం, ఫిబ్రవరి 2 -- TG Caste Census : తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా కులగణన సర్వే చేపట్టింది. సుమారు 50 రోజుల పాటు కులగణన సర్వే జరిగింది. ఈ నివేదికను ప్లానింగ్ కమిషన్ అధికారులు కేబినెట్ సబ్ కమిటీకి అందించారు. ఈ సర్వేలో 96.9 శాతం కుటుంబాలు తమ వివరాలు తెలిపాయి. 3.1 శాతం మంది సర్వేలో పాల్గొనలేదని కమిషన్‌ నివేదిక స్పష్టం చేసింది. మొత్తం 3.54 కోట్ల మందిని సర్వే చేసినట్లు చెప్పిన అధికారులు...రాష్ట్రంలో 46.25 శాతం బీసీ జనాభా ఉన్నట్లు నిర్థారించారు.

హైదరాబాద్ లోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సబ్‌ కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... కులగణన నివేదిక అందిందని చెప్పారు. దేశంలో ఎక్కడా ఇలాంటి సర్వే జరగలేదన్నారు. వెనుకబడిన వర్గాలకు న్యాయం చేయాలన్నదే కాంగ్రె...