భారతదేశం, మార్చి 7 -- TG Cabinet: తెలంగాణలో బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని మంత్రివర్గం నిర్ణ యించింది. ఎస్సీ వర్గీకరణపై జస్టిస్ అక్తర్ ఇచ్చిన సవరణ నివేదికకు మంత్రి మండలి అమోదం తెలిపింది.

తెలంగాణలో ఎస్సీల వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేస్తామని సీఎం తెలిపారు. ఈ మేరకు జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలో కమిషన్ నియమించగా.. ఫిబ్రవరి 3న నివేదిక ఇచ్చిందని వివరించారు. ఈ నివేదికలోని సిఫార్సులను అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చించామన్నారు. కమిషన్‌ నివేదికను పునః పరిశీలించాలని వివిధ వర్గాల నుంచి 71 విజ్ఞప్తులు వచ్చాయని వాటిని పరిశీలించి సవరణ నివేదిక ఇవ్వాలని కమిషను ప్రభుత్వం కోరిందని వివరించారు. న్యాయపరమైన చిక్కులు లేకుండా చట్టం తీసుకువచ్చేందుకు.. సవరణ నివేదికను కమిషన్ ఇచ్చింది. దాన్ని బిల్లు రూపంలో అసెంబ్లీ మ...