భారతదేశం, ఫిబ్రవరి 16 -- ఉప ఎన్నికలు ఎలా వస్తాయో కేటీఆర్‌ చెప్పాలని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కోర్టులు చేసే పని కేటీఆర్‌ చేయాలనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిసిన తర్వాత సీఎం రేవంత్‌ రెడ్డి మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సందర్బంగా పలు అంశాలపై స్పందించారు. రాజ్యాంగంలో ఉన్నదే కోర్టులు అనుసరిస్తాయని.. గతంలో సబిత, తలసాని ఏ పార్టీ బీఫామ్‌పై గెలిచారని ప్రశ్నించారు. ఎవరి హయాంలో మంత్రులు అయ్యారో కేటీఆర్‌ చెప్పాలమి సీఎం రేవంత్‌ రెడ్డి డిమాండ్ చేశారు.

కులగణనపైనా సీఎం స్పందించారు. 'కులగణన, ఎస్సీ వర్గీకరణలో తెలంగాణ ఒక రోల్‌ మోడల్‌. కులగణన ద్వారా ప్రజా సంక్షేమానికి బాటలు వేస్తున్నాం. రాహుల్‌ గాంధీ చెప్పింది నేను కచ్చితంగా చేస్తా. రాష్ట్రంలో కులగణన సమగ్రంగా నిర్వహించాం. ఇందులో వెల్లడైన వివరాల ఆధారంగా భవ...