భారతదేశం, ఏప్రిల్ 4 -- తెలంగాణలో మళ్లీ బర్డ్ ఫ్లూ కలకలం రేపింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని ఓ పౌల్ట్రీ ఫామ్‌లో వేలాది కోళ్లు మృత్యువాతపడ్డాయి. గత నాలుగు రోజుల కిందట కోళ్ల రక్త నమూనాలను సేకరించి, బర్డ్ ఫ్లూ అని నిర్దారించారు అధికారులు. కోట్లలో ఆస్థి నష్టం వాటిళ్లింది. దీంతో పౌల్ట్రీ ఫామ్ యజమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. చనిపోయిన కోళ్లను జేసీబీతో గుంత తీసి పూడ్చి పెట్టారు. కోడి గుడ్లు కూడా ఎవరికి అమ్మొద్దని అధికారుల ఆదేశాలు జారీ చేశారు.

బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కోళ్ల మాంసం, గుడ్లను తినేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. బర్డ్ ఫ్లూ అనేది ఏవియన్ ఇన్ఫ్లుఎంజా వైరస్ వల్ల వచ్చే ఒక ఇన్ఫెక్షన్. ఇది ప్రధానంగా పక్షులను ప్రభావితం చేస్తు...