Telangana,bhu bhati, ఏప్రిల్ 12 -- తెలంగాణ కొత్త భూచట్టం రాబోతుంది. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం 'భూ భారతి చట్టాన్ని రూపొందించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే శాసనసభ ఆమోదముద్ర వేయగా. గవర్నర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఈ నూతన చట్టాన్ని.. ఏప్రిల్ 14వ తేదీ నుంచి అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫలితంగా తెలంగాణ రెవెన్యూ వ్యవస్థలో కీలక మార్పులు ఉండనున్నాయి.

ఏప్రిల్ 14వ తేదీన హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతులు మీదుగా కొత్త చట్టంతో పాటు భూ భారతి పోర్టల్‌ను కూడా ఆవిష్కరించనున్నారు. ఇందుకోసం రెవెన్యూ శాఖ రంగం సిద్ధం చేస్తోంది. ఫలితంగా ప్రస్తుతం అమల్లో ఉన్న 'ధరణి' స్థానంలో భూ-భారతి పోర్టల్‌ అందుబాటులోకి వస్తుంది. ఆ తేదీ తర్వాత.. భూ భారతి పోర్టల్ ద్వారానే క్రయవిక్రయాలు జరుగుతాయి.

భూ సమస్యలకు సంబంధించి...