భారతదేశం, మార్చి 25 -- పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు వచ్చారు రీతు చౌదరి, విష్ణుప్రియ. ఇప్పటికే ఈనెల 20న వీరు విచారణకు హాజరయ్యారు. వారం కాకముందే మళ్లీ పోలీసులు వీరిని విచారణకు పిలిచారు. బెట్టింగ్ యాప్స్ నుంచి నిధులు ఎలా వచ్చాయన్న కోణంలో పోలీసులు ఆరా తీసినట్టు తెలుస్తోంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో యాంకర్ విష్ణుప్రియ హైకోర్టులో పిటిషన్ వేశారు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌లను కొట్టివేయాల్సిందిగా కోరుతూ.. పిటిషన్ దాఖలు చేశారు.

సోషల్ మీడియాలో ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను ప్రచారం చేసినందుకు.. రీతు చౌదరి, విష్ణుప్రియను పోలీసులు విచారణకు పిలిచారు. విచారణ సమయంలో, విష్ణుప్రియ మూడు బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసినట్లు పోలీసులకు చెప్పారు. కానీ.. పోలీసులు మాత్రం 15 యాప్‌లను ప్రమోట్ చేసినట్లు సమాచారం ఉందని చెప్పారు. గత సంవత్సరం బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ ...