భారతదేశం, ఫిబ్రవరి 10 -- TG Beer Price Hike : తెలంగాణలో మందుబాబులకు ప్రభుత్వం బ్యాడ్ న్యూస్ చెప్పింది. బీర్ల ధరలను 15 శాతం పెంచుతూ ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుత ధరపై ఈ పెంపు ఉన్నట్లు వెల్లడించింది. పెరిగిన ధరలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. వేసవిలో చల్లటి బీరుతో చిల్ అవుదామనుకుంటున్న మందుబాబులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. బీర్లపై అమాంతం 15 శాతం పెంచింది. దీంతో మందుబాబులు అసహనం వ్యక్తంచేస్తున్నారు. జస్టిస్ జైస్వాల్ కమిటీ సిఫార్సుల మేరకు బీర్ల ధరలను ఎక్సైజ్ శాఖ సవరించింది.

ఏపీలో కూడా మద్యం ధరలు 15 శాతం మేరు పెంచుతూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 15 శాతం మేర మద్యం ధరలు పెంచుతూ ఎక్సైజ్ శాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఇండియన్ మేడ్, ఫారిన్ లిక్కర్, బీర్లు...ఇలా మూడు కేటగిరీల్లో మద్యం సరఫరా చేస్తున్నారు. ప...