భారతదేశం, మార్చి 17 -- TG BCs Reservations : స్థానిక సంస్థల్లో, విద్యా, ఉద్యోగ అవకాశాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఇవాళ తెలంగాణ శాసనసభ బిల్లు ఆమోదించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ తీర్మానానికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చాయన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ...ఈ నిర్ణయం దేశానికి ఆదర్శం అన్నారు. దేశ వ్యాప్తంగా కుల గణన జరగాలని రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సందర్భంగా అసమానతలు గమనించి ఎవరెంతో వారికంత న్యాయం జరగాలంటే కుల గణన జరగాలని భావించారన్నారు.

"తెలంగాణలో రాహుల్ గాంధీ నాయకత్వంలో జిత్నే అజాది ఉత్నే ఇసదరి అని కుల గణన చేపట్టాం. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం గత సంవత్సరం ఫిబ్రవరి 4న కేబినెట్ లో నిర్ణయం తీసుకొని 16 ఫిబ్రవరి 2024లో శాసనసభలో ప్రవేశపెట్టి నిర్ణయం...