భారతదేశం, ఫిబ్రవరి 9 -- ఒవైసీ, రేవంత్ గ్యాంగ్ కలిసి బీసీలను దెబ్బతీసే కుట్ర చేస్తున్నాయని.. కేంద్రమంత్రి బండి సంజయ్ ఆరోపించారు. నల్లగొండ జిల్లాలో టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల కార్యశాలకు హాజరైన బండి.. బీసీ సంఘాలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. 'మీ అయ్య జాగీరా.. బీసీల్లో ముస్లింలను ఎట్లా చేరుస్తారు?' అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సంజయ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

'మేం బొట్టు పెట్టుకుంటాం.. మాకు జన్మ నక్షత్రముంది.. మొలదారం కట్టుకుంటాం. ఎవరు అధికారంలో ఉంటే వాళ్లకు వత్తాసు పలుకుతారా? ఇట్లయితే గ్రామాల్లోనూ బీసీ స్థానాల్లో ముస్లింలు పోటీ చేస్తారా? హిందువులు అడుక్కోవాలా? బిచ్చమెత్తుకోవాలా? జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలోనే ఈ కుట్రను అడ్డుకోకపోవడంవల్లే ఈ దుస్థితి వచ్చింది' అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.

'నిరుద్యోగ భృతి...