తెలంగాణ,హైదరాబాద్, మార్చి 6 -- త్వరలోనే తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఆ దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అధికారికంగా తేదీలను ప్రకటించాల్సి ఉంది. దీనిపై ఏ క్షణమైనా ప్రకటన చేసే అవకాశం ఉంది.

ఇక ఈసారి జరగబోయే సమావేశాలు ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ సభకు హాజరయ్యే అవకాశం ఉందన్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని బీఆర్ఎస్ శ్రేణులు కూడా స్పష్టం చేస్తున్నాయి. అయితే నిజంగానే కేసీఆర్ వస్తారా..? ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తారా..? అనేది టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ గా మారింది.

గతేడాది బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో కేసీఆర్ సభకు వచ్చారు. బడ్జెట్ ప్రసంగాన్ని విన్నారు. అయితే అసెంబ్లీకి వచ్చినప్పటికీ సభలో మాత్రం మాట్లాడల...