భారతదేశం, ఫిబ్రవరి 23 -- TG Anganwadi Vacancies : తెలంగాణలోని అంగన్వాడీ కేంద్రాల్లో 14,236 పోస్టుల భర్తీకి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. వీటిలో అంగన్వాడీ టీచర్‌ పోస్టులు 6,399 కాగా, హెల్పర్‌ పోస్టులు 7,837 ఉన్నాయి. ఈ భారీ నోటిఫికేషన్ పై మంత్రి సీతక్క శనివారం సంతకం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ముగియగానే జిల్లాల వారీగా కలెక్టర్లు ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు.

అంగన్వాడీ కేంద్రాల్లో భారీగా ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. చిన్నారులు, బాలింతలు, గర్భిణీలకు నాణ్యమైన పౌష్టికాహారం, చిన్నపిల్లకు ప్రీప్రైమరీ విద్యను అందించేందుకు అంగన్వాడీ టీచర్, సహాయకుల పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది.

తెలంగాణలో మొత్తం 35,700 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. అంగన్వాడీ కేంద్రంలో టీచర్‌తో పాటు హెల్పర్‌ ఉంటారు. అంగన్వాడీ కేంద్రాల్లో భా...