భారతదేశం, ఫిబ్రవరి 7 -- దాదాపు రెండు దశాబ్దాల కిందట.. తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో బీడు భూములే దర్శనమిచ్చేవి. సాగునీరు అందక రైతులు భూములను అలాగే వదిలేసేవారు. చాలా గ్రామాల్లో పెట్టుబడి కోసం డబ్బులు లేక సాగు చేసేవారు కాదు. భూగర్భ జలాలు అడుగంటి బోర్లు వేసినా ఫలితం ఉండేది కాదు. పైగా కరెంట్ కోతలు. ఇటు కాలువల ద్వారా వచ్చే నీరు అంతంత మాత్రంగానే ఉండేది.

కానీ గత పదేళ్లుగా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు తెలంగాణలో ఎక్కడ చూసినా పచ్చదనం కనిపిస్తోంది. రైతులు పోటీపడి వరిసాగు చేస్తున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తొలినాళ్లలో దొడ్డు వడ్లు పండించిన రైతులు.. ఇప్పుడు సన్నాలు సాగు చేస్తున్నారు. కేవలం వానాకాలం మాత్రనే కాదు.. యాసంగి సాగు విస్తీర్ణం కూడా భారీగా పెరిగింది. తెలంగాణలో వరిసాగు గణనీయంగా పెరగడానికి అనేక కారణాలు అనేకం ఉన్నాయి. వాట...