తెలంగాణ,హైదరాబాద్, ఫిబ్రవరి 27 -- ఇంజినీరింగ్ సహా ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాలపై తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. స్థానికతపై క్లారిటీ ఇచ్చింది. రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తి అయిన నేపథ్యంలో స్థానికత కోటాను సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు విద్యా శాఖ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా ఉత్తర్వులు ఇచ్చారు.

ఇంజినీరింగ్‌ కోర్సులతో పాటు వృత్తివిద్య కోర్సుల్లో 85 శాతం సీట్లను తెలంగాణ స్థానిక విద్యార్థులకు కేటాయించనుంది. వీరినే రిజర్వ్​డ్​ కోటాగా పేర్కొంది. మరో 15 శాతం అన్ రిజర్వ్​డ్​ కోటాగా పరిగణించనున్నట్లు తాజా ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

అన్ రిజర్వ్​డ్​ కోటా విషయంలోనూ ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. తెలంగాణలో కనీసం 10 ఏళ్లు నివసించినా. రాష్ట్రంలో పని చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు, లేదా ఉద్యోగుల భా...