భారతదేశం, ఫిబ్రవరి 27 -- లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ది చెందింది. కానీ, ఇప్పుడు టెస్లా యూరప్‌లో పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఎందుకంటే జనవరి 2025 యూరప్‌లో టెస్లా అమ్మకాలు భారీగా క్షీణించాయి. బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాల (బీఈవీ) అమ్మకాలు 37 శాతం పెరగ్గా, టెస్లా అమ్మకాలు మాత్రం 45 శాతం తగ్గాయి. ఎస్ఏఐసీ మోటార్స్ వంటి చైనా కంపెనీల నుంచి టెస్లాకు అతిపెద్ద ముప్పు పొంచి ఉంది.

టెస్లా కార్లు యూరప్‌లో ప్రాచుర్యం పొందాయి. కానీ ఇప్పుడు కొనుగోలుదారులు క్రమంగా బ్రాండ్‌కు దూరమవుతున్నారు. జనవరి 2025లో టెస్లా అమ్మకాలు యూరప్‌లో 45శాతం పడిపోయాయి. జనవరి 2024లో టెస్లా 18,161 యూనిట్లను విక్రయించింది. కానీ 2025 జనవరిలో కంపెనీ అమ్మకాలు 9,945 యూనిట్లకు పడిపోయాయి. ఫ్రాన్స్‌లో అమ్మకాలు 63 శాతం, జర్మనీలో 59.5 శాతం క్షీణించాయి...