భారతదేశం, డిసెంబర్ 29 -- Tesla in India : ఇండియాలో టెస్లా ఎంట్రీపై గత కొన్ని నెలలుగా ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజా ఓ వార్త బయటకి వచ్చింది. అపర కుబేరుడు ఎలాన్​ మస్క్​కు చెందిన టెస్లా.. 2024లో ఇండియాలోకి ఎంట్రీ ఇస్తుందని, తొలి ప్లాంట్​ని గుజరాత్​లో ఏర్పాటు చేస్తుందని నివేదికలు చెబుతున్నాయి. 2024 జనవరిలో.. జరగనున్న వైబ్రెంట్​ గుజరాత్​ సదస్సులో పాల్గొనేందుకు ఎలాన్​ మస్క్​ ఇండియాకు వస్తున్నారని, ఆ ఈవెంట్​లోనే ఈ ప్రకటన చేస్తారని అంటున్నాయి.

దేశంలోకి టెస్లా కార్లను తీసుకొచ్చేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం- ఎలాన్​ మస్క్​ బృందం మధ్య గత కొన్ని నెలలుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే.. తొలి ప్లాంట్​ను ఏర్పాటు చేసేందుకు.. మహారాష్ట్ర, గుజరాత్​, తమిళ్​నాడు వంటి రాష్ట్రాలపై టెస్లా ఫోకస్​ చేసినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి...