భారతదేశం, ఫిబ్రవరి 23 -- ప్రస్తుతం ఈవీ తయారీ దిగ్గజం టెస్లా పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. దానికి కారణం.. టెస్లా ఇండియన్ మార్కెట్​లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు రావడమే. దిగుమతి చేసుకునే కార్లపై కేంద్రం దాదాపు 110 శాతం సుంకాలు విధిస్తోంది. దీనివల్ల కార్ల ధర భారీగా పెరుగుతోంది. దేశంలో తయారీ యూనిట్‌ ఏర్పాటు ద్వారా.. సుంకాల భారాన్ని తగ్గించుకోవాలన్నది టెస్లా ఆలోచన.

సరిగ్గా ఇదే అంశాన్ని టార్గెట్ చేశారు సీఎం చంద్రబాబు. టెస్లాను ఆకర్షించడానికి పక్కా ప్లాన్ వేశారు. సిద్ధంగా ఉన్న భూమి, పోర్టు యాక్సెస్‌తో ట్రాక్‌లోకి వెళ్లారు. టెస్లా భారత్‌లోకి వస్తే.. తయారీ యూనిట్‌ను ఏపీలో ఏర్పాటు చేసేలా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అందివ్వబోయే ప్రోత్సాహకాలు, అందుబాటులో ఉన్న పోర్టులు, భూముల వివరాలతో టెస్లాను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు...