భారతదేశం, ఫిబ్రవరి 19 -- టెస్లా ఎలక్ట్రిక్ కార్లు భారతదేశంలోకి అడుగుపెట్టనున్నాయి. ఇప్పటికే ఇక్కడ ఉద్యోగులను కూడా టెస్లా రిక్రూట్‌ చేసుకుంటుందని వార్తలు వచ్చాయి. ఏప్రిల్‌లో టెస్లా తన మెుదటి షోరూమ్ ప్రారంభించనుందని, అప్పుడే ఈ కంపెనీ తొలి ఎలక్ట్రిక్ కారు ఇండియాలోకి రానుందని అంటున్నారు. వీటన్నింటి మధ్య.. అసలు టెస్లా కారుకు అమెరికాలో ఎందుకు అంత ఫేమస్ అని తెలుసుకుందాం..

టెస్లా కంపెనీ తన కార్ల ఆవిష్కరణ, అత్యుత్తమ పనితీరు, పర్యావరణ అనుకూలత, అత్యాధునిక డిజైన్, ఫీచర్ల కారణంగా అమెరికాలో ప్రజాదరణ పొందింది. ప్రభుత్వ ప్రోత్సాహకాలు, విస్తృతమైన సూపర్‌చార్జర్ నెట్‌వర్క్‌లు కూడా టెస్లా కార్ల కొనుగోలుదారులను ఆకర్షించాయి. ఎలోన్ మస్క్ కూడా సోషల్ మీడియా ద్వారా టెస్లా కంపెనీ కార్ల గురించి ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు. ఇది కూడా జనాల్లో ఈ కారు గురించి ఎప్ప...