భారతదేశం, ఫిబ్రవరి 1 -- Telugu Web Series: టాలీవుడ్ డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ ప్ర‌జెంట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించిన తెలుగు వెబ్‌సిరీస్ గుడ్ ఓల్డ్ డేస్ శ‌నివారం యూట్యూబ్‌లో రిలీజైంది. ఎలాంటి స‌బ్‌స్క్రిప్ష‌న్‌, రెంట‌ల్ ఛార్జీలు లేకుండా ఫ్రీగా యూట్యూబ్‌లో ఈ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. గుడ్ ఓల్డ్ డేస్ వెబ్‌సిరీస్‌లో తేజ‌శ్రీ రెడ్డి, భార్గ‌వ్ కొమ్మెర‌, అంకిత్ కొయ్య ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు.

ఈ వెబ్‌సిరీస్‌కు శ‌ర‌త్ పాలంకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ సిరీస్‌కు అత‌డే సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేయ‌డం గ‌మ‌నార్హం. శృతి రంజ‌ని మ్యూజిక్ అందించారు. మొత్తం ఐదు ఎపిసోడ్స్‌తో ఈ వెబ్‌సిరీస్ రూపొందింది. ఒక్కో ఎపిసోడ్ నిడివి 30 నిమిషాల వ‌ర‌కు ఉంది.

పార్వ‌తి అనే చిత్ర‌కారిణి (పెయింట‌ర్‌) జీవితం నేప‌థ్యంలో ఎమోష‌న‌ల్ ల‌వ్‌ డ్రామాగా ఈ వెబ్‌సిరీస్ రూపొందింది. పార్వ‌...