భారతదేశం, మార్చి 23 -- Telugu Tv Show: తెలుగు కామెడీ గేమ్ షో కిరాక్ బాయ్స్ ఖిలాడీ గ‌ర్ల్స్ సీజ‌న్ 2 లాంఛింగ్ డేట్‌ను స్టార్ మా రివీల్ చేసింది. ఈ షోకు హోస్ట్‌, జ‌డ్జ్‌ల‌తో పాటు కంటెస్టెంట్స్ ఎవ‌ర‌న్న‌ది కూడా వెల్ల‌డించింది. కిరాక్ బాయ్స్ ఖిలాడీ గ‌ర్ల్స్ సెకండ్ సీజ‌న్ మార్చి 29న మొద‌లుకానుంది. రాత్రి తొమ్మిది గంట‌ల‌కు ఫ‌స్ట్ ఎపిసోడ్ స్టార్ మాలో టెలికాస్ట్ కాబోతోంది. మార్చి 29 నుంచి ప్ర‌తి శ‌నివారం, ఆదివారాల్లో ఈ టీవీ షో టెలికాస్ట్ కానుంది.

హోస్ట్‌తో పాటు జ‌డ్జ్‌ల‌లో స్టార్ మా ఎలాంటి మార్పులు చేయ‌లేదు. మ‌రోసారి ఈ టీవీ షోకు హోస్ట్‌గా శ్రీముఖి క‌నిపిస్తోండ‌గా...కిరాక్ బాయ్స్ టీమ్‌కు శేఖ‌ర్ మాస్ట‌ర్‌...ఖిలాడీ గ‌ర్ల్స్ టీమ్‌కు అన‌సూయ జ‌డ్జ్‌లుగా వ్య‌వ‌హ‌రించ‌బోతున్నారు.

ఈ కామెడీ గేమ్ షో సెకండ్ సీజ‌న్‌లో పాల్గొనే కంటెస్టెంట్స్ ఎవ‌ర‌న్న‌ది ఇటీవ‌...