తెలంగాణ,రంగారెడ్డి,అమెరికా, మార్చి 6 -- అమెరికాలో మరో తెలుగు విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. దుండగులు జరిపిన కాల్పులకు బలైపోయాడు. ఈ ఘటన విస్కాన్సిన్‌ రాష్ట్రం మిల్వాకీ కౌంటీలో జరిగింది. చనిపోయిన విద్యార్థిని తెలంగాణకు చెందిన ప్రవీణ్ కుమార్ గంపా(27)గా గుర్తించారు. మృతదేహాన్ని స్వస్థలానికి తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ప్రవీణ్ కుమార్ గంగాపు ప్రస్తుతం విస్కాన్సిన్‌ రాష్ట్రంలోని యూనివర్సిటీ ఆఫ్‌ మిల్వాకీలో ఎంఎస్‌ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ప్రవీణ్‌ తాను నివాసం ఉండే ప్రాంతంలోని ఒక స్టోర్‌లో పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నాడు. అయితే ఈ స్టోర్ లో దుండగులు దోపిడీకి యత్నించిన క్రమంలో. ప్రవీణ్ కుమార్ కాల్పులకు గురైనట్లు "ది ఇండియన్ ఎక్స్ ప్రెస్" పేర్కొంది.

ఈ ఘటన చికాగోలోని భారత కాన్సులేట్ జనరల్ స్పందించింది. ప్రవీణ్ కుమార్ మృతిపై సంతాపం తెలిపి...