భారతదేశం, ఫిబ్రవరి 25 -- జీ తెలుగులో టీఆర్‌పీ రేటింగ్ ప‌రంగా టాప్‌లో ఉంది నిండు నూరేళ్ల సావాసం. ఈ సీరియ‌ల్ ఐదు వంద‌ల ఎపిసోడ్స్ పూర్తిచేసుకున్న‌ది. నేటితో (మంగ‌ళ‌వారం) ఈ మైలురాయిని చేరుకుంది. ఈ సంద‌ర్భంగా సీరియ‌ల్ టీమ్ త‌మ ఆనందాన్ని వ్య‌క్తం చేస్తూ సోష‌ల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టారు. 2023 ఆగ‌స్ట్ 14న ఈ సీరియ‌ల్ ప్రారంభ‌మైంది. ఫ్యామిలీ రివేంజ్ డ్రామాగా తెర‌కెక్కిన ఈ సీరియ‌ల్‌లో ప‌ల్ల‌వి గౌడ‌, నిస‌ర్గ‌, రిచ‌ర్డ్ జోస్‌, న‌వ్య‌రావు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

ప్ర‌స్తుతం ఈ సీరియ‌ల్ జీ తెలుగులో సోమ‌వారం నుంచి శ‌నివారం వ‌ర‌కు ప్ర‌తిరోజు రాత్రి ఏడు గంట‌ల‌కు టెలికాస్ట్ అవుతుంది. ప్ర‌జెంట్ టీఆర్‌పీ రేటింగ్ టాప్ ఫైవ్ సీరియ‌ల్స్‌లో ఒక‌టిగా నిండు నూరేళ్ల సావాసం కొన‌సాగుతోంది. లేటెస్ట్ రేటింగ్స్‌లో ఈ సీరియ‌ల్‌కు 5.89 టీఆర్‌పీ వ‌చ్చింది. నిండు నూరే...