భారతదేశం, మార్చి 11 -- Telugu Serial: గెస్ట్ రోల్స్ ట్రెండ్ సినిమాల్లోనే కాదు సీరియ‌ల్స్‌లో పాపుల‌ర్‌గా మారింది. ఓ టీవీ సీరియ‌ల్ యాక్ట‌ర్స్ మ‌రో టీవీ సీరియ‌ల్‌లో అతిథి పాత్ర‌ల్లో త‌ళుక్కున మెరుస్తూ అభిమానుల‌ను అప్పుడ‌ప్పుడు స‌ర్‌ప్రైజ్ చేస్తుంటారు. తాజాగా జీ తెలుగులో టెలికాస్ట్ అవుతోన్న గుండ‌మ్మ క‌థ సీరియ‌ల్‌లో కార్తీక దీపం ఫేమ్ శోభా శెట్టి గెస్ట్ రోల్‌లో న‌టిస్తోంది.

ఓ ఫ్యాష‌న్ షోలో మోడ‌ల్‌గా శోభా శెట్టి పాత్ర క‌నిపించ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఒక్క ఎపిసోడ్‌కే ప‌రిమితం అవుతుందా? ఆమె క్యారెక్ట‌ర్ లెంగ్త్ పెంచుతారా అన్న‌ది మాత్రం తెలియ‌డం లేదు. మంగ‌ళ‌వారం నాటి ఎపిసోడ్‌తో శోభాశెట్టి క్యారెక్ట‌ర్‌పై ఫుల్ క్లారిటీ రానుంది.

ప్ర‌స్తుతం తెలుగులో టెలికాస్ట్ అవుతోన్న లాంగెస్ట్ ర‌న్నింగ్ టీవీ సీరియ‌ల్‌గా గుండ‌మ్మ క‌థ రికార్డ్ క్రియేట్ చేసి...