భారతదేశం, ఫిబ్రవరి 8 -- బిగ్‌బాస్ ర‌న్న‌ర‌ప్ అమ‌ర్ దీప్ చౌద‌రి లీడ్ రోల్‌లో న‌టించిన తెలుగు సీరియ‌ల్ జాన‌కి క‌ల‌గ‌న‌లేదు క‌న్న‌డంలోకి డ‌బ్ అవుతోంది. క‌న్న‌డ వెర్ష‌న్‌కు జాన‌కి ర‌మ‌ణ అనే టైటిల్‌ను క‌న్ఫామ్ చేశారు. క‌ల‌ర్స్ క‌న్న‌డ ఛానెల్‌లో ఈ సీరియ‌ల్ టెలికాస్ట్ కాబోతోంది. త్వ‌ర‌లోనే సీరియ‌ల్ లాంఛింగ్ డేట్‌ను, టెలికాస్ట్ టైమ్‌ను రివీల్ చేస్తామ‌ని క‌ల‌ర్స్ క‌న్న‌డ ఛానెల్ పేర్కొన్న‌ది.

జాన‌కి క‌ల‌గ‌న‌లేదు సీరియ‌ల్‌లో బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 7 ర‌న్న‌ర‌ప్స్‌ అమ‌ర్ దీప్ చౌద‌రి, ప్రియాంక జైన్ కీల‌క పాత్ర‌లు పోషించారు. టాలీవుడ్ హీరోయిన్ రాశితో పాటు అనిల్ అల్లం, విష్ణుప్రియ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించారు. అరియానా గ్లోరీ, రాజా ర‌వీంద్ర, ప్రియాంక సింగ్‌తో పాటు ప‌లువురు టాలీవుడ్ న‌టుడు, బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ ఈ సీరియ‌ల్‌లో గెస్ట్ రోల్స్‌లో క‌నిపించి ...