భారతదేశం, మార్చి 28 -- Telugu Serial: జీ తెలుగులో టెలికాస్ట్ అవుతోన్న జ‌గ‌ద్ధాత్రి సీరియ‌ల్ ఐదు వంద‌ల ఎపిసోడ్స్ పూర్తిచేసుకున్న‌ది. శుక్ర‌వారం నాటి ఎపిసోడ్‌తో ఈ మైలురాయిని చేరుకున్న‌ది. లేటేస్ట్ టీఆర్‌పీ రేటింగ్‌లో జ‌గ‌ద్ధాత్రి అద‌రగొట్టింది. జీ తెలుగు సీరియ‌ల్స్‌లో అర్బ‌న్ ఏరియాలో 7.14 రేటింగ్‌తో నంబ‌ర్ వ‌న్ ప్లేస్‌లో నిలిచింది.

అర్బ‌న్ ప్ల‌స్ రూర‌ల్ ఏరియాలో క‌లిపి ఈ సీరియ‌ల్‌కు 6.77 రేటింగ్ వ‌చ్చింది. అర్బ‌న్ ప్ల‌స్ రూర‌ల్ టీఆర్‌పీ రేటింగ్‌లో చామంతి, మేఘ‌సందేశం, ప‌డ‌మ‌టి సంధ్యారాగం త‌ర్వాత నాలుగో ప్లేస్‌లో జ‌గ‌ద్ధాత్రి సీరియ‌ల్ నిలిచింది.

జగద్ధాత్రి సీరియల్ 2023 ఆగ‌స్ట్‌ 21వ ప్రారంభ‌మైంది. తొలుత‌ సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 7 గంటల 30 నిమిషాలకు ఈ సీరియ‌ల్‌ను టెలికాస్ట్ అయ్యింది. ఆ త‌ర్వాత ఈ సీరియ‌ల్ టైమ్ ఛేంజ్ చేశారు. ప్ర‌స్తుతం ...