భారతదేశం, ఫిబ్రవరి 23 -- Telugu Serial: సీరియ‌ల్ అంటే ఏళ్ల‌కు ఏళ్లు టెలికాస్ట్ కావ‌డం కామ‌న్‌. త‌క్కువ‌లో త‌క్కువ‌గా రెండు నుంచి మూడేళ్ల పాటైన సీరియ‌ల్స్‌ను న‌డిపిస్తుంటారు. 1500 ఎపిసోడ్స్ క్రాస్ చేసి నాలుగైదేళ్ల నుంచి టెలికాస్ట్ అయిన‌...అవుతోన్న‌ సీరియ‌ల్స్ కూడా ఉన్నాయి. అయితే జెమిని టీవీలో ప్ర‌సార‌మ‌వుతోన్న ఏవండోయ్ శ్రీమ‌తిగారు సీరియ‌ల్‌కు ఏడాదికే ముగింపు ప‌డింది. శ‌నివారం నాటి ఎపిసోడ్‌తో ఈ సీరియ‌ల్‌కు మేక‌ర్స్ శుభంకార్డు వేశారు. కేవ‌లం 342 ఎపిసోడ్స్‌తోనే ముగించారు.

గ‌త ఏడాది జ‌న‌వ‌రి 22న ఈ సీరియ‌ల్ మొద‌లైంది. ఈ ఫిబ్ర‌వ‌రి 22కు ఎండ్ కార్డ్ ప‌డింది. ఈ సీరియ‌ల్‌లో ప‌ల్ల‌విగౌడ, హ‌ర్షిత్ శెట్టి లీడ్ రోల్స్‌లో న‌టించారు. శ్రీనివాస్‌, శాంతి, గుత్తికొండ భార్గ‌వ, దేవిశ్రీ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించారు. ఈసీరియ‌ల్‌లో మిథున పాత్ర‌లో ప‌ల్ల‌విగౌడ క‌...