భారతదేశం, జనవరి 28 -- Telugu Serial: జీ తెలుగు సీరియ‌ల్ అమ్మాయిగారు ఇక నుంచి ఇంగ్లీష్‌లోనూ టెలికాస్ట్ కాబోతోంది. ఈ సీరియ‌ల్‌లో ఇంగ్లీష్ భాష‌లోకి డ‌బ్ చేశారు. ఇంగ్లీష్‌లోకి డ‌బ్ అయినా ఫ‌స్ట్ తెలుగు సీరియ‌ల్‌గా అమ్మాయిగారు నిలిచింది. అమ్మాయి గారు ఇంగ్లీష్ వెర్ష‌న్‌కు డ్రైవ‌ర్ బై డెకాయిట్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు.

జీ వ‌ర‌ల్డ్ ఛానెల్‌లో సోమ‌వారం నుంచి శుక్ర‌వారం వ‌ర‌కు ఈ సీరియ‌ల్ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సీరియ‌ల్ కేవ‌లం సౌతాఫ్రికాలో మాత్ర‌మే టెలికాస్ట్ కానున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

అమ్మాయిగారు సీరియ‌ల్‌లో నిషా ర‌వికృష్ణ‌న్‌, య‌శ్వంత్ గౌడ లీడ్ రోల్స్‌లో న‌టిస్తోన్నారు. అనిల్ అల్లం, సుస్మిత‌, నీర‌జ‌, చైత్ర‌, మాన‌స కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఇటీవ‌లే ఈ సీరియ‌ల్ 700 ఎపిసోడ్స్ పూర్తిచేసుకున్న‌ది. తండ్రీకూతుళ్ల అనుబంధంతో ఈ సీరియ‌ల్ రూపొంది...