భారతదేశం, మార్చి 1 -- Telugu OTT: హెబ్బా ప‌టేల్ హీరోయిన్‌గా టాలీవుడ్ రొమాంటిక్ కామెడీ మూవీ ధూం ధాం మూడో ఓటీటీలోకి వ‌స్తోంది. ఇప్ప‌టికే ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహా ఓటీటీల‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఈటీవీ ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. మార్చి 6న ధూం ధాం స్ట్రీమింగ్ కానున్న‌ట్లు ఈటీవీ విన్ ఓటీటీ ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు పోస్ట‌ర్‌ను అభిమానుల‌తో పంచుకున్న‌ది.

ధూం ధాం మూవీలో చేత‌న్ కృష్ణ, హెబ్బా ప‌టేల్ హీరోహీరోయిన్లుగా న‌టించారు. వెన్నెల కిషోర్‌, సాయికుమార్‌, గోప‌రాజు ర‌మ‌ణతో పాటు ప‌లువురు టాలీవుడ్ క‌మెడియ‌న్లు ఈ మూవీలో కీల‌క పాత్ర‌లు పోషించారు. సీనియ‌ర్ రైట‌ర్ గోపిమోహ‌న్ క‌థ‌, స్క్రీన్‌ప్లేను స‌మ‌కూర్చిన ఈ సినిమాకు సాయికిషోర్ మ‌చ్చా ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ధూం ధాం మూవీ నవంబ‌ర్‌లో థియేట‌ర్...