భారతదేశం, జనవరి 31 -- Telugu OTT: తెలుగు కామెడీ మూవీ అది ఒక ఇదిలే ఓటీటీలో రిలీజైంది. శుక్ర‌వారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఫ్రీ స్ట్రీమింగ్ కాకుండా రెంట‌ల్ విధానంలో ఈ తెలుగు మూవీ ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. అది ఒక ఇదిలే మూవీని చూడాలంటే అమెజాన్ ప్రైమ్ స‌బ్‌స్క్రిప్ష‌న్‌తో పాటు 99 రూపాయ‌ల రెంట‌ల్ చెల్లించాల్సిందే. అమెజాన్ ప్రైమ్‌తో బీసీఐనీట్ ఓటీటీలో కూడా అది ఒక ఇదిలే మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

రొమాంటిక్ కామెడీ ల‌వ్ డ్రామాగా తెర‌కెక్కిన ఈ మూవీలో స‌బ్య‌సాచి మిశ్రా, రాధిక ప్రీతి హీరోహీరోయిన్లుగా న‌టించారు. ర‌క్ష భ‌వానీ, శ్యామ్ తేజో వికాస్ కీల‌క పాత్ర‌లు పోషించారు. టాలీవుడ్ కొరియోగ్రాఫ‌ర్ స్వ‌ర్ణ మాస్ట‌ర్‌ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. క‌థ‌, మాట‌లు, స్క్రీన్‌ప్లే, కొరియోగ్ర‌ఫీ కూడా స్వ‌ర్ణ మాస్ట‌ర్‌ అ...