భారతదేశం, మార్చి 23 -- Telugu OTT: టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్‌ సుకుమార్‌ కూతురు సుకృతి వేణి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన గాంధీ తాత చెట్టు ఓటీటీలో అద‌ర‌గొడుతోంది. ఇటీవ‌ల అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైన ఈమూవీ ట్రెండింగ్ మూవీస్‌లో ఒక‌టిగా కొన‌సాగుతోంది. స‌మాజానికి ఉప‌యుక్త‌మైన మంచి సినిమాగా ఓటీటీలోనూ ప్ర‌శంస‌ల‌ను అందుకుంటోంది.

గాంధీ తాత చెట్టు సినిమాలో సుకృతి వేణితో పాటు ఆనంద‌చ‌క్ర‌పాణి, రాగ్‌మ‌యూర్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ప‌ద్మావ‌తి మ‌ల్లాది ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్‌, సుకుమార్ రైటింగ్స్ ప‌తాకాల‌పై సుకుమార్ స‌తీమ‌ణి త‌బిత ఈ సినిమాను నిర్మించింది.

మెసేజ్ ఓరియెంటెడ్ మూవీగా తెర‌కెక్కిన గాంధీతాత చెట్టు జ‌న‌వ‌రి నెలాఖ‌రున థియేట‌ర్ల‌లో రిలీజైంది. సుకృతివేణి యాక్టింగ్‌తో పాటు కాన్సెప్ట్ ఆడియెన్స...