భారతదేశం, ఏప్రిల్ 1 -- Telugu OTT: బిగ్‌బాస్ తెలుగు ర‌న్న‌ర‌ప్‌ శ్రీహాన్ హీరోగా న‌టించిన రొమాంటిక్ ల‌వ్ డ్రామా మూవీ లైఫ్ పార్ట్‌న‌ర్ ఓటీటీలోకి రాబోతోంది. ఈటీవీ విన్ ఓటీటీలో ఏప్రిల్ 6న రిలీజ్ కానుంది. ఈ విష‌యాన్ని ఈటీవీ విన్ మంగ‌ళ‌వారం అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించింది. లైఫ్ పార్ట‌న‌ర్ మూవీని స‌బ్‌స్క్రిప్ష‌న్ అవ‌స‌రం లేకుండా ఫ్రీగా చూడొచ్చ‌ని ఈటీవీ విన్ ప్ర‌క‌టించింది.

క‌థాసుధ పేరుతో కొత్త ద‌ర్శ‌కుల‌తో కొన్ని సినిమాల‌ను రూపొందించ‌బోతున్న‌ట్లు ఇటీవ‌లే ఈటీవీ విన్ ప్ర‌క‌టించింది. . ఈ క‌థాసుధ‌లో భాగంగా ప్ర‌తి ఆదివారం ఓ సినిమా ఈటీవీ విన్‌లో రిలీజ్ కానుంది. ఈ సినిమాల‌ను సీనియ‌ర్ డైరెక్ట‌ర్ రాఘ‌వేంద్ర‌రావు ప్రొడ్యూస్ చేశారు. ఈ క‌థాసుధ‌లో భాగంగా తొలి మూవీగా లైఫ్ పార్ట్‌న‌ర్ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ర‌న్‌టైమ్ ముప్ఫై నిమిషాలు ఉండ‌బోతున్న‌...