భారతదేశం, మార్చి 21 -- Telugu OTT: ర‌వితేజ క్రాక్‌, శ్రీవిష్ణు అల్లూరి సినిమాలు ఓటీటీలోకి వ‌చ్చాయి. ఇప్ప‌టికే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ తెలుగు మూవీస్ తాజాగా అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ‌య్యాయి. ఈ విష‌యాన్ని అమెజాన్ ప్రైమ్ అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించింది.

ర‌వితేజ హీరోగా న‌టించిన క్రాక్ మూవీకి గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. 2021లో థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ 70 కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ర‌వితేజ కెరీర్‌లో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది.

క్రాక్ సినిమాలో శృతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టించింది. స‌ముద్ర‌ఖ‌ని, వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ విల‌న్ పాత్ర‌ల్లో క‌నిపించారు. ఏపీ, తెలంగాణ‌లో జ‌రిగిన కొన్ని క్రైమ్స్ ఆధారంగా క్రాక్‌ క‌థ‌ను రాసుకున్న‌ట్లు ప్ర‌మోష‌న్స్‌లో గోపీచంద్ మ‌లినేన...