భారతదేశం, జనవరి 28 -- తెలుగు సినిమాలకు ఉత్తరాదిలో ఫుల్ క్రేజ్ ఉంటుంది. అందుకే దేశవ్యాప్తంగా తెలుగు సినిమాలు.. ఇతర భాషల్లోనూ డబ్బింగ్ అయి దుమ్మురేపుతున్నాయి. ఇండియా మొత్తం టాలీవుడ్‍వైపే చూస్తోంది. అయితే, డిజాస్టర్ అయిన కొన్ని తెలుగు చిత్రాలు హిందీ డబ్బింగ్‍లో యూట్యూబ్‍లో సత్తాచాటుతుంటాయి. గతంలోనూ కొన్ని చిత్రాల విషయంలో ఇలా జరిగింది. ప్లాఫ్ అయిన చిత్రాలకు హిందీ డబ్బింగ్‍లో భారీ వ్యూస్ దక్కాయి. ఇప్పుడు మరోసారి 'డబుల్ ఇస్మార్ట్' సినిమా విషయంలో అదే రిపీట్ అయింది. రామ్‍ పోతినేని హీరోగా నటించిన ఈ చిత్రం హిందీ డబ్బింగ్ యూట్యూబ్‍లో ఓ భారీ మైల్‍స్టోన్ దాటి ఆశ్చర్యపరిచింది.

డబుల్ ఇస్మార్ట్ సినిమా హిందీ డబ్బింగ్ వెర్షన్‍.. ఆర్‌కేడీ స్టూడియోస్ అనే యూట్యూబ్ ఛానెల్‍లో 100 మిలియన్ (10 కోట్లు) వ్యూస్ దాటేసింది. తాజాగా ఈ మార్క్ అధిగమించింది. ఏకంగా మిలియన్...