భారతదేశం, మార్చి 23 -- Telugu folk song: హీరో మంచు విష్ణు ఓ తెలుగు ఫోక్ సాంగ్‌కు ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రించారు. గోదారికే సోగ్గాన్నే టైటిల్‌తో రిలీజైన ఈ పాట‌లో టాలీవుడ్ యాక్ట‌ర్లు, రియ‌ల్ లైఫ్ క‌పుల్ శివ‌బాలాజీ, మ‌ధుమిత జంట‌గా న‌టించారు. ఈ ఫోక్ వీడియో సాంగ్‌ను రెడ్ లారీ ఫిల్మ్ ఫెస్టివల్‌లో రిలీజ్ చేశారు.

ఈ సంద‌ర్భంగా శివ బాలాజీ మాట్లాడుతూ .. 'ఈ పాటలో కంటెంట్ 8 నిమిషాలు ఉంటుంది. పాటలోనే కథ మొత్తం చెప్పాలి. ఈ కాన్సెప్ట్‌కి మ్యూజికల్ న‌రేషన్ అని పేరు పెట్టాను. ముందుగా ఈ పాట‌లో నేను, మ‌ధుమిత‌ నటిస్తామని అనుకోలేదు. ఈ కాన్సెప్ట్ నా వద్దకు వచ్చింది. ఆ తరువాత మధుమిత ప్రాజెక్ట్‌లోకి ఎంట‌రైంది. . మేం ఇద్దరం సింగిల్ టేక్‌లో సాంగ్ పూర్తి చేశాం. ఈ వీడియో సాంగ్‌కు రెండు క్లైమాక్స్ ప్లాన్ చేశాం. పాట అద్భుతంగా వచ్చింది. అందరికీ నచ్చుతుంది' అని అన్నారు....