భారతదేశం, మార్చి 2 -- తెలుగు బాక్సాఫీస్ వద్ద ఈ వారం డబ్బింగ్ చిత్రాల హవానే ఉండనుంది. మూడు వేర్వేరు భాషల సినిమాలు తెలుగు డబ్బింగ్‍లో ఈ శుక్రవారం మార్చి 7న థియేటర్లలో విడుదల కానున్నాయి. ఈ మూడు చిత్రాలు.. ఒకదానితో పోలిస్తే మరొకటి డిఫరెంట్ జానర్లలో ఉన్నాయి. ఒకటి హిస్టారికల్ మూవీ కాగా.. మరొకటి ఫ్యాంటసీ హారర్ చిత్రం. మరో క్రైమ్ థ్రిల్లర్ మూవీ కూడా వస్తోంది. మార్చి 7న తెలుగు డబ్బింగ్‍లో థియేటర్లలో రిలీజ్ కానున్న మూడు చిత్రాలు ఏవంటే..

హిందీ సినిమా 'ఛావా' భారీ కలెక్షన్లతో అదరగొడుతోంది. విక్కీ కౌశల్, రష్మిక మందన్నా ప్రధాన పాత్రలు పోషించిన ఈ హిస్టారికల్ యాక్షన్ మూవీ ఇప్పటికే రూ.500కోట్ల గ్రాస్ కలెక్షన్ల మార్క్ దాటింది. హిందీలో ఈ చిత్రం ఫిబ్రవరి 14న విడుదలైంది. భారీగా వసూళ్లను రాబడుతోంది. ఛావా చిత్రం తెలుగు డబ్బింగ్‍లో మార్చి 7వ తేదీన థియేటర్లలో విడ...