Hyderabad, మార్చి 19 -- Telugu Crime Thriller Web Series: క్రైమ్ థ్రిల్లర్ జానర్లో జియోహాట్‌స్టార్ ఓటీటీలోకి ఓ తెలుగు వెబ్ సిరీస్ రాబోతోంది. ఈ సిరీస్ పేరు టచ్ మి నాట్ (Touch me not). టాలీవుడ్ హీరో నవదీప్, కన్నడ స్టార్ దీక్షిత్ శెట్టి లీడ్ రోల్స్ లో నటించిన సిరీస్ ఇది. సైకోమెట్రీ ఆధారంగా మర్డర్ మిస్టరీని ఛేదించే సిరీస్ గా ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.

టచ్ మి నాట్ వెబ్ సిరీస్ జియోహాట్‌స్టార్ ఓటీటీలోకి రానుంది. బుధవారం (మార్చి 19) ట్రైలర్ రిలీజ్ చేయగా.. ఏప్రిల్ 4 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఇది ఓ కొరియన్ డ్రామా ఆధారంగా తెరకెక్కింది. హి ఈజ్ సైకోమెట్రిక్ (He is Psychometric) అనే వెబ్ సిరీస్ ఆధారంగా ఈ టచ్ మి నాట్ ను రూపొందించారు. కొన్ని రోజుల కిందటే ఈ టచ్ మి నాట్ వెబ్ సిరీస్ ను అనౌన్స్ చేసిన జియోహాట్‌స్టార్.. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేసిం...