భారతదేశం, ఏప్రిల్ 13 -- యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన మజాకా చిత్రం ఈ ఏడాది ఫిబ్రవరి 26న థియేటర్లలో రిలీజైంది. నక్కిన త్రినాథరావు దర్శకత్వం వహించిన ఈ కామెడీ మూవీ మంచి బజ్ మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, మిక్స్డ్ టాక్ దక్కించుకొని అంచనాలకు తగ్గట్టుగా ఈ చిత్రానికి కలెక్షన్లు రాలేదు. ఈ చిత్రం ఓటీటీలో మంచి వ్యూస్ సాధించింది. మజాకా చిత్రం ఇక టీవీలో ప్రసారమయ్యేందుకు సిద్ధమైంది.

మజాకా సినిమా జీ తెలుగు టీవీ ఛానెల్‍లో ఏప్రిల్ 20వ తేదీ సాయంత్రం 6 గంటలకు ప్రసారం కానుంది. తొలిసారి టీవీలో టెలికాస్ట్ కానుంది. థియేటర్లలో రిలీజైన రెండు నెలల్లోగానే ఈ చిత్రం టీవీ ఛానెల్లోకి వచ్చేస్తోంది.

మజాకా సినిమా మార్చి 28వ తేదీన జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. థియేటర్లలో నిరాశాజనక ఫలితం వచ్చినా.. ఓటీటీలో మాత్రం ఈ చిత్రం మంచి వ్యూస్ దక్కించ...