భారతదేశం, ఫిబ్రవరి 17 -- Telangana BC CM : తెలంగాణలో కులగణన, ఎస్సీ వర్గీకరణ, బీసీలకు రిజర్వేషన్ల గత కొన్ని రోజులుగా తీవ్ర చర్చ జరుగుతోంది. తాజాగా ఈ విషయాలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. ఈ 5 సంవత్సరాలు సీఎంగా రేవంత్ రెడ్డే ఉంటారని స్పష్టం చేశారు. వచ్చే రోజుల్లో రాజకీయాలు అన్నీ బీసీ అజెండాగా జరుగుతాయన్నారు. బీసీ సీఎం కేవలం కాంగ్రెస్ తోనే సాధ్యం అవుతుందన్నారు. భవిష్యత్తులో తెలంగాణలో బీసీ సీఎం అవుతారన్నారు.

"వచ్చే కేబినెట్ లో బీసీలకు ప్రాధాన్యత ఉంటుంది. తెలంగాణలో బీసీ కులగణన చేయడంతోనే మా నిబద్ధతను నిరూపించుకున్నాం. దేశంలో బీజేపీ ప్రభుత్వం చాలా రాష్ట్రాల్లో ఉంది. వాళ్లు ఎక్కడా బీసీ కులగణన చేయలేదు. కులగణన చేయకుండా బీసీల గురించి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి నిబద్దత ఉంది కాబట్టి తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కులగణన చే...