ఆంధ్రప్రదేశ్,తెలంగాణ, ఏప్రిల్ 6 -- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన రెండు ప్రధాన నదుల అనుసంధాన ప్రాజెక్టులైన గోదావరి-బనకచెర్ల లింక్ స్కీం, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ (ఆర్ఎల్ఐఎస్)పై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది.

శుక్రవారం హైదరాబాద్ లోని జలసౌధలో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఇటీవలనే ఆమోదం తెలిపింది.

సుప్రీంకోర్టులో పిటిషన్ వేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై న్యాయనిపుణులు, నీటి పారుదల శాఖ స్టాండింగ్ కౌన్సిల్స్, అడ్వకేట్ జనరల్ తో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టు 1980 నాటి గ...