భారతదేశం, ఏప్రిల్ 10 -- Telangana Updates: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఆరు గ్రామాలు దేశస్థాయిలో ర్యాంకులు సాధించాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల సర్వే నిర్వహించి సుస్థిర అభివృద్ది సాధించిన గ్రామాలను ఎంపిక చేసింది. తెలంగాణలో 25 గ్రామ పంచాయితీలు ఎంపిక కాక అందులో ఆరు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉండడంతో కేంద్ర మంత్రి బండి సంజయ్ తోపాటు కరీంనగర్ రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లా అధికారులు హర్షం వ్యక్తం చేశారు.

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో సుస్థిర అభివృద్ది సాధనలో పురోగతి సాధించిన గ్రామ పంచాయితీలు తిమ్మాపూర్, చందుర్తి మండలం బండపల్లి, జమ్మికుంట మండలం గండ్రపల్లి, మల్యాల మండలం బల్వంతపూర్, రుద్రంగి, ఎల్లారెడ్డిపేట. ఈ ఆరు గ్రామ పంచాయతీలు మెరుగైన ర్యాంకుల...